ఒక సంస్థ సత్ఫలితాలు సాధించాలంటే ఆ సంస్థలోని వారంతా చక్కని ప్రేరణతో పనిచేయాలి. పని విషయంలో అందరూ కలిసి లక్ష్యసాధన కోసం పరిశ్రమించేలా చేయడమే ...
ఒక సంస్థ సత్ఫలితాలు సాధించాలంటే ఆ సంస్థలోని వారంతా చక్కని ప్రేరణతో పనిచేయాలి. పని విషయంలో అందరూ కలిసి లక్ష్యసాధన కోసం పరిశ్రమించేలా చేయడమే ''టీమ్ బిల్డింగ్". అసలు టీమ్ బిల్డింగ్ అంటే ఏమిటో, దాని నెలా నిర్వహించాలో తెలుసుకుందాం.
టీమ్ లీడర్ సంస్థకు గార్డియన్ లాగా వ్యవహరించాలి. సభ్యులందరినీ కలిపి, సఖ్యతతో పనిచేసేట్లు చేసే చాకచక్యం ఉండాలి. టీమ్ లీడర్ అనుక్షణం తనను తాను ప్రేరేపించుకుంటూ తన టీమ్ సభ్యుల్ని ప్రేరేపిస్తూ ఉండాలి. సంస్థలో ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా మీటింగులు, శిక్షణా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి.
సభ్యులు ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటూ టీమ్ వర్క్ ను సమర్థవంతంగా కొనసాగించవచ్చు. అందరినీ కలుపుకుని గమ్యాన్ని చేరడానికి టీమ్ లీడర్ ప్రయత్నించాలి. ప్రతి సభ్యుడు స్వయం ప్రేరణతో పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. సంస్థలోని వ్యక్తుల అవసరాలను గుర్తించి వాటిని సంతృప్తి పరచటానికి ప్రయత్నించాలి.
టీమ్ లీడర్ విశ్వాస పాత్రుడుగా ఉండాలి. సంస్థ లక్ష్యాలను, సాధించవలసిన విధానాలను, సంస్థ ఆశయాలను సమాచార పంపిణీ ద్వారా టీమ్ లోని ప్రతి సభ్యునికి తెలియాలి. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కొన్ని సమయాల్లో స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశమివ్వాలి. సంస్థపై నమ్మకం కలిగించేలా టీమ్ లీడర్ ఆత్మీయంగా ప్రవర్తించాలి. ఎప్పటికప్పుడు చర్చలు జరిపి సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడం చేయాలి. టీమంతా కలిసి పనిచేస్తున్నప్పుడు వారిలో బాగా పనిచేసిన వారికి, సృజనాత్మకత చూపించిన వారికి తప్పనిసరిగా అభినందనలు అందించాలి.
టీమ్ లీడర్, టీమ్ లక్ష్యాలకు విధానాలకు ఇతర సభ్యులతో అనుగుణ్య త కలిగి ఉండాలి. అవసరమైన గుణాలను అభివృద్ధి పరచుకోవాలి.
కొత్త సమస్యలు లేదా సవాళ్లు ఎదురైనప్పుడు అనేక విధాలుగా ఆలోచన చేసి నూతన పరిష్కారాలను కనుగొనాలి. సమైక్యంగా పనిచేసి విజయ సాధన చేయాలి. ప్రతి సభ్యుడు అకుంఠిత దీక్షతో నిబద్ధంగా పనిచేయాలి. సభ్యుల మధ్య స్వేచ్ఛగా భావప్రసారం జరగాలి. టీమ్‌లోని ప్రతి ఒక్కరితోనూ స్నేహ పూరిత సంబంధము పెంచుకోవాలి.
పూర్తిస్థాయిలో తన సామర్థ్యాలను ఉపయోగించి తనకు కేటాయించిన పనిని నిర్వహించాలి. ఎంత పని చేశామన్న దానికన్నా, ఎంత సమర్తతో పనిచేసావన్నదే ముఖ్యం. క్రమబద్ధమైన ఆలోచన చేయగలిగి ఉండాలి. కాల నిర్వహణ సమర్థత కలిగి ఉండటం సరైన సమయంలో సరైన నిర్ణయాలతో వృత్తి సామర్థ్యాన్ని పెంచే అలవాట్లు ఏర్పరచుకోవడం, ఇతరుల సామర్థ్యాలను గుర్తించి గౌరవించాలి. అభినందించాలి.
నేను తెలుసుకోవలసినది చాలా ఉంది అనుకున్నప్పుడే స్వీయ అభివృద్ధి జరుగుతుంది. నాకు అన్నీ తెలుసు అనే అహంకారం స్వీయ అభివృద్ధికి శత్రువు లాంటిది. ప్రతిరోజూ నేర్చుకుంటూ నిత్య అన్వేషకుడిగా ఉండాలి. స్వార్థంతో నీవే పొందాలనుకుంటే నీవు ఇతరులకు దూరమవుతావు. నీవు ని స్వార్థంగా ఇతరులకు ఇవ్వాలనుకుంటే నీవు ఇతరులకు దగ్గరవుతావు.
పరిష్కారం కనుగొనటం కాదు. పరిష్కారాన్ని తయారుచేయాలి. ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి. క్రమపద్ధతిలో వివేచనతో కూడిన ఆలోచన, బహుళ ప్రతిస్పందనలతో కూడిన ఆలోచనల ద్వారా పరిష్కారం లభ్యమౌతుంది. అందిన ప్రతి అవకాశంలో పూర్తిస్థాయిలో సామర్థ్యాలను ఉపయోగించాలి. తప్పనిసరిగా సాధించాలనే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి.
ఇతరుల అభిప్రాయాలను వారి పనులను, వారి అవసరాలను విలువ నిచ్చి తన దృష్టితో కాక, ఇతరుల దృష్టితో కూడా సమస్యలను ఆలోచించి, పరిష్కరించగల తదనుభూతిని టీమ్ లీడర్ పెంచుకోవాలి.
తనకు తాను స్వయం ప్రేరణ కలిగించుకుంటూ తన సమూహంలోని సభ్యులలో కూడా ప్రేరణ కలిగించి ఉత్పాదకతను పెంచాలి. సరైన ప్రణాళిక నిర్వహణ, నియంత్రణ, సరైన నిర్ణయం మొదలగు నైపుణ్యాలు ఏ రంగంలోని నాయకునకేనా సత్ఫలితాలనిస్తుంది.
ఇతరులతో సత్సంబంధాలు కలిగి, ఇతరులలో తన భావాలను నేర్పుతో వ్యక్త పరిచే సమాచార నైపుణ్యాలు సమర్థవంతుడైన నాయకుడికి అవసరం. సంస్థలో అందరూ కలిసి పనిచేసే వైఖరి పెంపొందుతుంది.
ప్రణాళికాబద్ధంగా సమయపాలనతో, క్రమశిక్షణతో సరైన మార్గదర్శకత్వంతో నాయకత్వం వహించటం వలన ప్రతి ఒక్కరూ ఉత్తేజిత్తులై సంస్థ విజయానికి కారకులవుతారు. టీమ్‌వర్క్లలో ప్రతి సభ్యుడూ ఎల్లప్పుడూ ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి. ఆశావాదిగా ఉండాలి. నిరాశావాద భావనలతో ఇతర సభ్యులను నిరుత్సాహ పరచరాదు.
తన ప్రవర్తన పట్ల, ఉద్వేగాల పట్ల పట్టు కలిగి క్రమశిక్షణతో వ్యవహరించాలి. సర్దుబాటు ధోరణి కలిగి ఉంటూ టీమ్ మేలుకై కృషిచేయాలి. సరైన పథకము తయారు చేసుకుని అందుకు ముందుగా సిద్ధము కావడం జట్టు విజయానికి అవసరం. లక్ష్యాన్ని సాధించటానికి టీమ్ సభ్యులు సరైన పథకాన్ని సిద్ధము చేసుకుని ఆ పథకాన్ని సరైన రీతిలో అమలుచేయాలి.
టీమ్ లీడర్ గా వ్యవహరించేవారు ఉన్నతమైన సవాలు గొలిపే లక్ష్యాలను కలిగి ఉండడం, నిర్ణయించిన లక్ష్యాల సాధనకు గట్టి కోరికకై, ప్రేరకం కలిగి ఉండటం, పనిలో క్రమంగా పెరుగుదల చూపించటం, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉండడం, ఇతరుల నుంచి మంచి నిష్పాదనను ఆశించటం, సమూహ సభ్యుల సామర్థ్యాలలో విశ్వాసాన్ని కలిగి ఉండటం, టీమ్ సభ్యుల బాధ్యతలను భుజాన వేసుకుని పనిచేయడం, పోటీ తత్వాన్ని కలిగి యుండడం, సాధించి తీరాలనే పట్టుదలను కలిగి ఉండడం, చేసే పనిలో మెరుగుదలను కనబరచడం వంటివి.
తాను సాధించుకోదలచిన దానికి సంబంధించి స్పష్టమైన విజన్ లేదా భావం కలిగి ఉండే మొత్తం సమూహ సభ్యులందరిని ఆ లక్ష్యసాధనలో ఒప్పించటానికి తగిన ప్రయత్నం చేస్తాడు. గాఢావేశంతో ఉత్సాహం, ఉత్తేజంగా ఉట్టిపడిఉండే నాయకులనే ప్రజలు ఇష్టపడతారు. అవసరమైతే టీమ్ లీడర్ సమూహ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తన స్వీయ సౌఖ్యాలను, స్థాయిని, ఆరోగ్యాన్ని, కుటుంబ సంక్షేమాన్ని కూడా త్యాగం చేయవలసి రావచ్చు.
నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అతడు/ఆమె విజయవంతంగా కృషి చేయాలి. అతని/ ఆమె ప్రవర్తన, వైరి, నడవడిక పద్ధతులు అలవాటు చేష్టలు అన్నీ కూడా తన సమూహ సభ్యులకు ఒక ఉదాహరణకు పాత్ర నమూనాగా ఉండేటట్లుండాలి.
తన ఆలోచనలు, తన ప్రణాళికలు, పథకాలు అన్నీ ఇతరులకు ఆమోదయోగ్యంగా, ఆదర్శనీయంగా అంగీకారయోగ్యంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఆలోచనల్లో తార్కికత చోటు చేసుకుంటే ప్రతిదీ క్రమంలో సాగుతుంది. విల్‌పవర్, సంసిద్ధత, సందర్శశుద్ధి వంటి గుణాలు టీమ్ లీడర్ అలవరచుకుంటే టీమ్ బిల్డింగ్ పటిష్టంగా ఏర్పడగలదు.

COMMENTS