వ్యాయామం అనేది శారీరక దృఢత్వం , ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల కండరాలకు శక్తి చేకూరుతుంది. రక్త ప్రసరణ వ్...
వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల కండరాలకు శక్తి చేకూరుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పడుతుంది, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించవచ్చు, అధిక బరువు తగ్గించుకోవచ్చు మరియు మానసిక ఉల్లాసం, వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందవచ్చు తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి దూరంగా ఉండవచ్చు. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.వ్యాయామాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును.
- కండరాలు, కీళ్ళు కదలికలు సులభంగా జరిగేందుకు ఉపకరించే వ్యాయామం.
- వాయుసహిత వ్యాయామాలు: సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి.
- వాయురహిత వ్యాయామాలు: కసరత్తులు, బరువుతగ్గడానికి యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు.
- దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.
- వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాల అవసరం. మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను ధృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి మరియు వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
విద్యార్థులకు ఉపయోగాలు
విద్యార్థులు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధనల వల్ల తెలుస్తుంది.
COMMENTS