కావలసినవి : శనగపప్పు - ముప్పావు కప్పు ; బెల్లంతురుము - కప్పు ; పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు ; ఏలకుల పొడి - పావు టీ స్పూన...
కావలసినవి: శనగపప్పు - ముప్పావు కప్పు; బెల్లంతురుము - కప్పు; పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; బొంబాయిరవ్వ – ఒకటి న్నర కప్పులు; పాలు - మూడు కప్పులు; నూనె-డీప్ ఫ్రైకి సరిపడా
తయారి: శనగపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్లో ఉడికించాలి. ఉడి కిన తర్వాత నీరు ఎక్కువగా ఉంటే వడపోసి, పప్పు చల్లారాక, మిక్సీలో వేసి పొడిపొడిగా వచ్చేలా చేయాలి. ఒక పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగి, మరిగేవరకు ఉంచాలి. శనగపప్పు పొడి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఉడికించి దించేయాలి ? చల్లారాక, ఉండల్లా చే సి పక్కన ఉంచాలి. గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ? బొంబాయిరవ్వ నెమ్మదిగా వేస్తూ, కలుపుతుండాలి. మంట తగ్గించి, మిశ్రమం దగ్గర పడేవరకు రెండు నిముషాలు ఉడికించాలి. చల్లారిన తరవాత మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి. చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చే సుకోవాలి. ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని పూరీ షేప్లోకి ప్రెస్ చేయాలి. శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి అంచులను మూసేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయలి.
COMMENTS