కరికులమ్ విటే ( curriculum vitae ) అర్థం ఏమిటి ? కరికులమ్ విటే అనేది లాటీన్ పదం దీని అర్ధం మీ జీవిత కధ. దీన్నే క్లుప్తంగా CV గా వ్యవహరిస...
కరికులమ్ విటే (curriculum vitae) అర్థం ఏమిటి?
కరికులమ్ విటే అనేది లాటీన్ పదం దీని అర్ధం మీ జీవిత కధ. దీన్నే క్లుప్తంగా CV గా వ్యవహరిస్తారు. కొన్ని దేశాల్లో దీన్ని రెస్యూమ్ అని కుడా అంటారు. రెస్యూమ్ అంటే ఫ్రెంచ్ భాషాలో సమ్మరీ అని అర్ధం.
CV ఎలా వ్రాయాలి ?
సాధారణంగా CVని ఏడు భాగలుగా విభజించవచ్చు. అవి
1. వ్యక్తిగత వివరాలు (Personal details)
ఇందులో మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, జాతీయత(nationality) మొదలైన విషయాలు గురించి వ్రాయాలి. సాదారణంగా ఈ భాగం మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియజేసే విధంగా ఉండాలి.
2. విద్య (Education)
ఇందులో మీ విధ్యార్హతలు, మీరు చదివిన పాఠశాల మరియు కళాశాల వివరాలు, అర్హత సాధించిన సంవత్సరం, అందుకున్న పధకాలు మరియు మీ యొక్క ప్రత్యేక అర్హతలు వివరించాలి. కాలక్రమం ప్రారంభం నుండి ఉండాలి. ఉదాహరణకు 10వ తరగతి తర్వత ఇంటర్ అపై డిగ్రీ, పీజీ.
3. ఉపాధి (Employment)
మీరు ఇది వరకు చేసిన ఉద్యోగం, పనిచేసిన సంస్ధ పేరు, దాని చిరునామా. అ సంస్ధలో మీ డిజిక్నేషన్, పని చేసిన సమయం మరియు మీరు అందులో మీరు సాధించిన విజయాలు తెలియజేయాలి.
4. ఇతర నైపుణ్యాలు: (Other skills)
ఇందులో మీరు శిక్షణ పొందిన మరియు అధ్యయనం చేసిన విషయాలు మీ యొక్క నైపుణ్యాలు ఉదాహరణకు మీరు చేసిన కంప్యూటర్ కోర్సులు మీకు తెలిసిన భాషలు మరియు మీ ఇతర ఆచరణాత్మక సామర్ధ్యాలు లేదా మీరు చేసిన స్పెషల్ డిప్లొమాలు ఇందులో వివరించాలి.
5. అభిరుచులు: (Interests)
మీ హాబీలు, క్రీడలు మరియు విరామ సమయంలో మీరు చేసే పనులు ఇందులో వివరించాలి.
6. అదనపు సమాచారం:
మీ ప్రత్యేక అర్హతలు మరియు మీ నైపుణ్యాలు మీరు సాధించిన విజయాలు. సాధారణంగా ఇందులో మీరు ఎలాంటి వారో, మీ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయో ఇందులో వివరంచించాలి.
7. ప్రస్తావన వ్యక్తులు (References)
మీమ్మల్ని రిఫర్ చేసిన ఇద్దరి పేర్లు, వారి చిరునామా మరియు పూర్తి వివరాలు ఇందులో వ్రాయాలి.
COMMENTS