చిలకలూరిపేట: పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మీడి...
చిలకలూరిపేట: పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచిందని పేర్కొన్నారు. గతంలో ఉన్న రూ. 3,000 పెన్షన్‌ను రూ. 4,000 కు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ను రూ. 6,000 కు పెంచడం జరిగిందని, అలాగే ఇతర విభాగాల్లో రూ. 10,000 నుండి రూ. 15,000 వరకు పెన్షన్లు అందుతున్నాయని వివరించారు. ఒక్క చిలకలూరిపేట పట్టణంలోనే 10,790 మంది లబ్ధిదారులకు నెలకు సుమారు రూ. 4.75 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, జిల్లా మొత్తంలో పెన్షన్ల పంపిణీలో చిలకలూరిపేట మొదటి స్థానంలో నిలిచిందని ఆయన గర్వంగా ప్రకటించారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటో తేదీ నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని,ఈ సంక్షేమ ఫలాలను ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు.
COMMENTS