• ప్రపంచ కార్మిక దినోత్సవ (మేడే) వేడుకల్లో శాసనసభ్యులు ప్రత్తిపాటి. దేశ పురోగతికి శ్రమజీవుల కష్టమే ఇందనమని, ఆర్థికాభివృద్ధి, స...
• ప్రపంచ కార్మిక దినోత్సవ (మేడే) వేడుకల్లో శాసనసభ్యులు ప్రత్తిపాటి.
దేశ పురోగతికి శ్రమజీవుల కష్టమే ఇందనమని, ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతిలో కార్మికులు, కర్షకులే ప్రధాన పాత్రధారులని, వారు స్వేదం చిందించడం మానేస్తే వ్యవస్థలే కుప్పకూలుతాయని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా శుక్రవారం ఆయన టీడీపీ అనుబంధ విభాగమైన టీ.ఎన్.టీ.యూ.సీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట కళామందిర్ కూడలిలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ.ఎన్.టీ.యూ.సీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు.
కార్మికుల సంతోషం. సంక్షేమం కోసం చంద్రబాబు 4 ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు.
కర్షకులు, కార్మికులు పనిచేయడం మానేస్తే దేశ ప్రగతే కుంటుపడుతుందని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ప్రత్తిపాటి చెప్పారు. చంద్రబాబు అమలుచేసిన ఉచిత ఇసుక విధానానికి స్వస్తిచెప్పిన జగన్ దోపిడీ నిర్వాకంతో భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలక పాల్పడాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. గత ప్రభుత్వం కార్మికుల నోట్లో మట్టికొట్టి, వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే కార్మికుల భవిష్యత్ కు నిజమైన భద్రత, వారి జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 4 ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. కార్మికుల మరణానంతరం వారి మట్టిఖర్చులకు రూ.20వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు, కార్మికుల వివాహ సమయంలో రూ.20వేలు, ప్రసూతి ఖర్చులకు రూ.20వేలు, అందించే పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. మరణానంతరం కార్మికుల కుటుంబాలకు అక్కరకొచ్చే బీమా సొమ్ము, ప్రభుత్వాల సాయం సకాలంలో అందించే విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా కార్మికుల నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. కార్మికుల శ్రేయస్సే తన ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు వారికి అన్నివిధాల అండగా నిలుస్తూ, కార్మిక పక్షపాతిగా నిలిచారని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా,పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు బేరింగ్ మౌలాలి, ముల్లా కరీముల్లా, అరెకట్ల కోటేశ్వరరావు, టీ.ఎన్.టీ.యూ.సీ నాయకులు బొన్నం శ్రీనివాసరావు, చెల్లి బాబు, పల్లపు వీరయ్య, వీరాంజనేయులు, కుంచాల నాగేశ్వరరావు, కుంట కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS