చిలకలూరిపేట పట్టణంలో పోలీసులు భారీస్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి, వారికి జరిమానాలు విధిం...
చిలకలూరిపేట పట్టణంలో పోలీసులు భారీస్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి, వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులు, ఎస్సై హాజరత్తయ్య మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు అర్బన్ సి.ఐ రమేష్ సూచనల మేరకు వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపినా లేదా లైసెన్స్ లేకుండా ప్రయాణించినా వాహనాలను సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రతి బైకును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
COMMENTS