చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా ఆధ్వర్యంలో ఒక గర్భిణికి అత్యవసర స్థితిలో విజయవ...
చిలకలూరిపేట: స్థానిక లీలావతి హాస్పిటల్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా ఆధ్వర్యంలో ఒక గర్భిణికి అత్యవసర స్థితిలో విజయవంతంగా ప్రసవం జరిగింది. వైద్య పరిభాషలో క్లిష్టమైనదిగా భావించే పరిస్థితుల్లో డాక్టర్ సుష్మా సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డలను కాపాడారు.
ముందస్తు ప్రసవం - PPROM సవాలు.
గర్భిణికి గడువు కంటే ముందే ఉమ్మనీరు పోవడం వల్ల తీవ్ర ఇబ్బంది నెలకొంది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో పాటు శిశువు ప్రాణాలకు ముప్పు ఉంటుంది. పరిస్థితిని గమనించిన డాక్టర్ సుష్మా, ఏమాత్రం జాప్యం చేయకుండా
ప్రాథమిక అత్యవసర LSCS (సిజేరియన్) నిర్వహించాలని నిర్ణయించారు.
పుట్టిన మగ శిశువు.. ఆరోగ్య పరిస్థితి...
ఈ శస్త్రచికిత్స అనంతరం సదరు మహిళ మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 2.25 కిలోగ్రాముల బరువుతో జన్మించారు. ముందస్తు ప్రసవం అయినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో శిశువు క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దంపతులకు వీరు ప్రథమ సంతానం కావడంతో కుటుంబంలో సంతోషం నెలకొంది.
శస్త్రచికిత్స సమయంలోనూ, ఆ తర్వాత కోలుకునే ప్రక్రియలోనూ ఎటువంటి ఇతర ఆరోగ్య ఇబ్బందులు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో వైద్య సహాయం అందడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితురాలి బంధువులు డాక్టర్ లావు సుష్మాకు కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS