పల్నాడు: వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ పైన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమీక్షా సమావేశం నిర్వహి...
పల్నాడు: వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ పైన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో రైతులకు ఆర్థికంగా మరింత బలాన్నిచ్చే లక్ష్యంతో కిస్సాన్ క్రెడిట్ కార్డ్స్ (KCC) పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలను పొందగలరని పేర్కొన్నారు.
కిస్సాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చు. ఇది రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించడంలో మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
లబ్దిదారులకు బ్యాంకులు విరివిగా ఋణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఇప్పటికే కార్డు పొందిన రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించి ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని కోరారు.
అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS