ప్రసవంలోని నిద్రాణ దశ.. చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్‌లో వైద్య రంగంలో మరో మైలురాయి నమోదైంది. అకాల ...
ప్రసవంలోని నిద్రాణ దశ..
చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్‌లో వైద్య రంగంలో మరో మైలురాయి నమోదైంది. అకాల ప్రసవ ముప్పు పొంచి ఉన్న ఒక గర్భిణీకి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా తన నైపుణ్యంతో చికిత్స అందించి, గర్భాన్ని పూర్తి కాలం వరకు పొడిగించడమే కాకుండా.. చివరకు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా సాధారణ కానుపు అయ్యేలా చేసి విజయం సాధించారు.
సవాలుగా మారిన అకాల ప్రసవ ముప్పు..
సదరు గర్భిణికి తొలుత LPL (Preterm risk) లక్షణాలు కనిపించడంతో అకాల ప్రసవం జరిగే ప్రమాదం ఏర్పడింది. శిశువు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకముందే పుట్టే అవకాశం ఉండటంతో, పరిస్థితి క్లిష్టంగా మారింది. అయితే, డాక్టర్ లావు సుష్మా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అధునాతన చికిత్స మరియు నిరంతర పర్యవేక్షణ ద్వారా గర్భాన్ని సురక్షితంగా పూర్తి కాలం వరకు పొడిగించగలిగారు.
ఆరోగ్యంగా తల్లి, బిడ్డ - 3 కిలోల ఆడబిడ్డ జననం..
వైద్యుల నిరంతర కృషి ఫలితంగా ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండానే సాధారణ ప్రసవం జరిగింది. బాధితురాలు 3 కిలోల బరువున్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇది ఆమెకు మొదటి కానుపు కావడం విశేషం. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
నార్మల్ డెలివరీలే లక్ష్యంగా 'లీలావతి' సేవలు..
నేటి కాలంలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధారణ కానుపులు చేయడమే లక్ష్యంగా డాక్టర్ లావు సుష్మా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
"గర్భిణీ స్త్రీలకు సరైన అవగాహన, ధైర్యం కల్పిస్తూ, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి సుఖ ప్రసవం అయ్యేలా చూడటమే మా ప్రథమ ప్రాధాన్యత."
క్లిష్టమైన స్థితిలో కూడా నార్మల్ డెలివరీ చేసిన డాక్టర్ సుష్మాను, లీలావతి హాస్పిటల్స్ బృందాన్ని స్థానికులు మరియు బాధితురాలి బంధువులు అభినందిస్తున్నారు.
COMMENTS