మూడు సిలిండర్లు సీజ్... చిలకలూరిపేట: గృహ వినియోగం కోసం కేటాయించిన ఎల్‌పిజి (LPG) గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య...
మూడు సిలిండర్లు సీజ్...
చిలకలూరిపేట: గృహ వినియోగం కోసం కేటాయించిన ఎల్‌పిజి (LPG) గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. గుంటూరు ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి ఆదేశాల మేరకు, సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
చిలకలూరిపేట టౌన్‌లోని కోటప్పకొండ అడ్డా రోడ్డులో ఉన్న M/s. సాయి బాలాజీ క్యాటరింగ్ సంస్థపై అధికారులు ఆకస్మిక దాడి చేశారు.క్యాటరింగ్ అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్న 3 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక పౌర సరఫరాల శాఖ ఎం.ఆర్.ఐ కి అప్పగించారు. ఈ మేరకు సదరు యజమానిపై అత్యవసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ 6-A కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ దాడులకు సంబంధించిన నివేదికను తదుపరి చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్ కి సమర్పించనున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక సివిల్ సప్లైస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ వాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
COMMENTS