కోర్టు ద్వారా కఠిన చట్టపరమైన చర్యలు.. చిలకలూరిపేట:మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ఇప్పటివరకు సుమారు రూ. 11 కోట్ల ఆదాయం సమకూరిందని మ...
కోర్టు ద్వారా కఠిన చట్టపరమైన చర్యలు..
చిలకలూరిపేట:మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ఇప్పటివరకు సుమారు రూ. 11 కోట్ల ఆదాయం సమకూరిందని మున్సిపల్ రెవెన్యూ అధికారి ఆర్వో సుబ్బారావు వెల్లడించారు. మంగళవారం ఆయన చాంబర్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆర్.ఐ గిరిబాబుతో కలిసి ఆయన మీడియాతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలలో ఆదాయ రాబడిలో చిలకలూరిపేట ప్రస్తుతం 35వ స్థానంలో ఉందని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ప్రభుత్వం వడ్డీ రాయితీ గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించిందని, బకాయిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పన్నులను చెల్లించాలని కోరారు.నిర్ణీత గడువులోగా పన్నులు చెల్లించని పక్షంలో, అటువంటి వారిపై కోర్టు ద్వారా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణ అభివృద్ధికి పౌరులు తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.
COMMENTS