పల్నాడు : జిల్లా కేంద్రంలోని గుర్రం జాషువా మీటింగ్ హాల్లో న్యూట్రి గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం (ATM) మోడ...
పల్నాడు : జిల్లా కేంద్రంలోని గుర్రం జాషువా మీటింగ్ హాల్లో న్యూట్రి గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం (ATM) మోడల్స్, టెర్రస్ గార్డెన్స్, కమ్యూనిటీ గార్డెన్స్ మరియు బయో-రిసోర్స్ సెంటర్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ మనోజ్, అమల కుమారి , ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మెప్మా , డీఆర్దీఏ, ఐసిడిఎస్,డీపీఓ , ఎంపీడీఓ లు, ఎంసి లు, ఏపీఎం లు, ఎంఈఓ లు, సిడిపిఒ లు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, ప్రతి కుటుంబం స్వయంగా ఆహారాన్ని పండించుకోవడం, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె. అమలుకుమారి మాట్లాడుతూ,రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యలను వివరించారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు.న్యూట్రి గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్ మరియు కమ్యూనిటీ గార్డెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. చిన్న స్థలంలోనే పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేయవచ్చని చెప్పారు. సూర్య మండలం మోడల్‌లో పంటల శాస్త్రీయ అమరిక వల్ల తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, ఏటీఎం (Any Time Money) మోడల్ ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చని వివరించారు.ఇంటి వద్ద పండించిన ఆహారం రసాయన రహితంగా ఉండటం వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు,అదనపు ఉత్పత్తిని విక్రయించి ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం కనీసం ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ,పాఠశాలలు, అంగనవాడి కేంద్రాలు, కళాశాలలు మరియు SHG మహిళల వద్ద అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రి గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.చిన్నపిల్లలకు అంగనవాడి కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని, చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
న్యూట్రి గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేయాలని సూచించారు. బయో-రిసోర్స్/ఇన్‌పుట్ సెంటర్ల ఏర్పాటు మరియు పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.శిక్షణలో భాగంగా సూర్య మండల మోడల్, కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, టెర్రస్ మరియు కమ్యూనిటీ గార్డెన్స్ ఏర్పాటు, విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాలb తయారీపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతో పాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహదం అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
COMMENTS