చిలకలూరిపేట: మండల పరిధిలోని ఎడవల్లి సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరి ప్రసాద్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెం...
చిలకలూరిపేట: మండల పరిధిలోని ఎడవల్లి సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరి ప్రసాద్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రోడ్డుపై ఆయన శరీరంపైనే స్కూటీ పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వృత్తిరీత్యా లాయర్ కావడంతో ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా? ఘటనపై ఎస్సై అనిల్ కుమార్ ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
COMMENTS