పల్నాడు: జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, గుంటూరు జాయింట్ కమీషనర్ (రాష్ట్ర పన్నులు)-II జాన్ స్టీవెన్సన్ పాత...
పల్నాడు: జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, గుంటూరు జాయింట్ కమీషనర్ (రాష్ట్ర పన్నులు)-II జాన్ స్టీవెన్సన్ పాత్రో ఆధ్వర్యంలో జిఎస్‌టి (GST) కో-ఆర్డినేషన్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లాలో జిఎస్‌టి వసూళ్లను మరింత సమర్థవంతంగా పెంచడం మరియు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.
*శాఖల మధ్య సమన్వయం అవసరం..*
ఈ సందర్భంగా జాయింట్ కమీషనర్ జాన్ స్టీవెన్సన్ పాత్రో మాట్లాడుతూ,జిల్లాలో పన్ను వసూళ్లను లక్ష్యం మేరకు సాధించడంలో వివిధ ప్రభుత్వ విభాగాల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇతర శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని జిఎస్‌టి విభాగంతో పంచుకోవడం ద్వారా పన్నుఎగవేతలను అరికట్టవచ్చని ఆయన వివరించారు.ఈ విషయంలో సంబంధిత శాఖాధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ని కోరారు.ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడే జిల్లా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి. జిఎస్‌టి వసూళ్లలో పల్నాడు జిల్లా ముందుండేలా అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలి ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులు మరియు జిల్లాలోని పలు పట్టణ కమిషనర్లు పాల్గొన్నారు.
COMMENTS