చిలకలూరిపేట: బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాతకే మార్గదర్శకుడైన మహాత్మా జ్యోతిరావు పూలేకు తక్షణమే భారతరత్న ప్రకటించాలని చ...
చిలకలూరిపేట: బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాతకే మార్గదర్శకుడైన మహాత్మా జ్యోతిరావు పూలేకు తక్షణమే భారతరత్న ప్రకటించాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త ఎం. రాధాకృష్ణ డిమాండ్ చేశారు.గురువారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే నరేంద్ర మోడీ, పూలే వంటి మహనీయుడిని గుర్తించకపోవడం శోచనీయమన్నారు. అగ్రవర్ణానికి చెందిన రాహుల్ గాంధీ బీసీల గణన కోసం, రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే, మోడీ మాత్రం కులగణనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. పూలే ఆశయాలను నిజంగా కొనసాగిస్తున్నది రాహుల్ గాంధీ మాత్రమేనని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ మాట్లాడుతూ పూలేకు భారతరత్న వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉప్పుటూరి అనిల్ కుమార్, ఎర్ర గళ్ళ రవికుమార్, మైనారిటీ నేతలు మరియు పార్టీ కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.
COMMENTS