పల్నాడు: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో న్యూట్రీ గార్డెన్ లు అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధి...
పల్నాడు: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో న్యూట్రీ గార్డెన్ లు అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. మండలానికి ఒకటి చొప్పున కమ్యూనిటీ గార్డెన్ ను అభివృద్ధి చేయాలన్నారు. కమ్యూనిటీ గార్డెన్ ఏర్పాటు కోసం క్షేత్రాన్ని ఎంపిక చేయాలని డీపీవోను ఆదేశించారు. డ్వామా శాఖ కమ్యూనిటీ గార్డెన్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్నారు.
డ్వాక్రా మహిళలకు కిచెన్ గార్డెన్, మిద్దె తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వాలన్నారు. న్యూట్రి గార్డెన్ ల కార్యక్రమం కోసం మండల స్థాయి అధికారులకు ఈ వారంలోగా శిక్షణ పూర్తి చేయాలన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలునుంచి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జలధార - జల హారతి, గ్రామ ఆరోగ్య దర్శిని, న్యూట్రి గార్డెన్ కార్యక్రమాలపై వెబెక్స్ ద్వారా సమీక్ష సమావేశం
నిర్వహించారు.
COMMENTS