చిలకలూరిపేట: పట్టణ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తమ ఇంటి పన్ను, నీటి పన్ను మరియు ఖాళీ స్థల పన్నులను సకాలంలో చెల్...
చిలకలూరిపేట: పట్టణ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తమ ఇంటి పన్ను, నీటి పన్ను మరియు ఖాళీ స్థల పన్నులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ రెవిన్యూ ఆఫీసర్ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ మరియు అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.బకాయిలు ఉన్న వారు ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే చెల్లించి పౌర బాధ్యతను చాటుకోవాలని, తద్వారా పురపాలక సంఘం అందించే సేవలను మరింత మెరుగుపరిచేందుకు తోడ్పడాలని ఆయన కోరారు.
COMMENTS