చిలకలూరిపేట:వేసవి కాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, బాణాసంచా గోడౌన్లలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్...
చిలకలూరిపేట:వేసవి కాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, బాణాసంచా గోడౌన్లలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహా అధికారులను, యజమానులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం చిలకలూరిపేట రూరల్ పరిధిలోని 'సీ మార్ట్' బాణాసంచా గోడౌన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిబంధనల మేరకు గోడౌన్లలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై యజమానులకు పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటుజిల్లా అగ్నిమాపక అధికారి,ఆర్డీవో బాలకృష్ణ,ఇతర రెవెన్యూ ,ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ స్పష్టం చేశారు.
COMMENTS