ఎడ్లపాడు మండల పరిధిలోని పెప్సీ కంపెనీ ఎదురుగా, ఉన్నవ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న విశ్వధన్ హోటల్‌పై ఈరోజు విజిలెన్స్ మరియు ర...
ఎడ్లపాడు మండల పరిధిలోని పెప్సీ కంపెనీ ఎదురుగా, ఉన్నవ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న విశ్వధన్ హోటల్‌పై ఈరోజు విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి,వాటిని సీజ్ చేశారు.భద్రతా కారణాల దృష్ట్యా సీజ్ చేసిన సిలిండర్లను ఎడ్లపాడులోని వీణా గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను హోటల్ యాజమాన్యంపై స్థానిక తహసీల్దార్ 6A కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ తనిఖీలో ఎడ్లపాడు మండలడిప్యూటీ తహసీల్దార్ అనురాధ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఉన్నవ గ్రామ
వీఆర్వో జగన్మోహన్ రావు మరియు ఇతర మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS