సాధారణ కాన్పుకే మొగ్గుఆదర్శంగా నిలిచిన డాక్టర్ వరలక్ష్మి.. చిలకలూరిపేట : ప్రస్తుత కాలంలో కవలలు అంటేనే సిజేరియన్ ఆపరేషన్ తప్పనిసర...
సాధారణ కాన్పుకే మొగ్గుఆదర్శంగా నిలిచిన డాక్టర్ వరలక్ష్మి..
చిలకలూరిపేట : ప్రస్తుత కాలంలో కవలలు అంటేనే సిజేరియన్ ఆపరేషన్ తప్పనిసరి అని భావించే పరిస్థితుల్లో, చిలకలూరిపేటలోని వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ వైద్యులుసాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొమ్మినేని వరలక్ష్మి తన నైపుణ్యంతో ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా, సాధారణ ప్రసవంద్వారా కవలలకు జన్మనిప్పించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆరోగ్యంగా ఇద్దరు ఆడ శిశువులు, తల్లీ బిడ్డలు క్షేమం..
ఈ ప్రసవంలో ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. మొదటి శిశువు 2.5 కేజీలు, రెండో శిశువు 2.4 కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. సాధారణంగా కవలల ప్రసవంలో తలెత్తే సంక్లిష్టతలను అధిగమించి, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండేలా వైద్య బృందం తగిన జాగ్రత్తలు తీసుకుంది.
పీడియాట్రిక్ పర్యవేక్షణలో శిశువుల ఆరోగ్యం....
శిశువుల ఆరోగ్యంపై ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ గరికపాటి సిద్ధార్థ్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పుట్టిన వెంటనే శిశువులకు అవసరమైన ప్రాథమిక చికిత్సలు మరియు పరీక్షలు నిర్వహించి, వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ధృవీకరించారు. కవల పిల్లల సంరక్షణలో డాక్టర్ సిద్ధార్థ్ అందించిన సేవలు ఎంతో కీలకమైనవి.
వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
ఆపరేషన్ భయం లేకుండా, సురక్షితంగా సాధారణ ప్రసవం చేసినందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ కొమ్మినేని వరలక్ష్మి మరియు డాక్టర్ గరికపాటి సిద్ధార్థ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS