పల్నాడు జిల్లాలో ది.22.01.2026 వ తేదీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల.పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటనలో పాల...
పల్నాడు జిల్లాలో ది.22.01.2026 వ తేదీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల.పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటనలో పాల్గొననున్నారు.ఈ సందర్బంగా, ఉప ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని కోటప్పకొండ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా ఏర్పాట్లను పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించి, సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఎస్పీ సూచనలు:
భద్రతా చర్యలు..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రజలలో మరియు కార్యకర్తలలో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని,వారి భద్రతకు ఎటువంటి అంతరాయం కలగకుండా సక్రమమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి.ప్రజలు గుంపులుగా చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
వీవీఐపీ ప్రయాణ మార్గాలలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షణ చేపట్టాలి.
ప్రవేశ నియంత్రణ.
వీవీఐపీ భద్రత దృష్ట్యా హెలిప్యాడ్ వద్ద,కొండ పైన దర్శనం వద్ద,కొత్తపాలెం రోడ్డు ప్రారంభించే వద్ద జిల్లా భద్రతా విభాగం (DSW) సిబ్బంది క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు మరియు ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యక్రమానికి ఆటంకం కలిగించే అవకాశమున్న వారిని ముందస్తుగా గుర్తించి పైఅధికారులకు సమాచారం అందించాలి.
సమన్వయం...
వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, కార్యక్రమానికి హాజరయ్యే శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భద్రతా చర్యలను అమలు చేయాలి.
సమస్యలపై తక్షణ స్పందన...
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎక్కడైనా సమస్య తలెత్తినపుడు వెంటనే పైఅధికారులకు సమాచారం అందించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. వీవీఐపీ బందోబస్తును సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) JV. సంతోష్, అదనపు ఎస్పి (క్రైమ్) లక్ష్మీపతి, అదనపు ఎస్పీ వి. సత్తిరాజు, నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS