చిలకలూరిపేట: మండల పరిధిలోని తాతపూడి హైవేపై మంగళవారం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వె...
చిలకలూరిపేట: మండల పరిధిలోని తాతపూడి హైవేపై మంగళవారం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది.లారీ ఢీకొన్న వేగానికి ఆటో అదుపుతప్పి రహదారిపైనే పలు పల్టీలు కొట్టింది.ఈ ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఆటో సత్తెనపల్లి నుంచి ముప్పవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
COMMENTS