చిలకలూరిపేట:స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన ఉత్సాహం నెలకొంది. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు తన చాంబర్‌లో ...
చిలకలూరిపేట:స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన ఉత్సాహం నెలకొంది. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు తన చాంబర్‌లో 'సత్యాగ్రహం' దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరి బాబు మాట్లాడుతూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. 'సత్యాగ్రహం' దినపత్రిక ప్రజల గొంతుకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సత్యాగ్రహం బ్యూరో మరియు APUWJ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్ మున్సిపల్ కార్యాలయ ఉద్యోగస్తులతో పాటు, 'పెన్ పవర్' రిపోర్టర్ శ్రీకాంత్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
COMMENTS