చిలకలూరిపేట: స్థానిక గోల్కొండ గార్డెన్స్‌లో 'సత్యాగ్రహం' తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్ర...
చిలకలూరిపేట: స్థానిక గోల్కొండ గార్డెన్స్‌లో 'సత్యాగ్రహం' తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికలు సమాజ హితం కోసం పనిచేయాలని, నిష్పక్షపాత వార్తలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. సత్యాగ్రహం పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 'సత్యాగ్రహం' తెలుగు దినపత్రిక పల్నాడు జిల్లా ఇంచార్జ్ మరియు APUWJ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, విద్యా సంఘం నాయకులు సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు బతినేని శ్రీనివాసరావు, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు, బేరింగ్ మౌలాలి, మండల పార్టీ నాయకులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS