ఎమ్మార్పీఎస్ చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా గొర్రెపాటి సుభాషిని నియామకం.. చిలకలూరిపేట: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి...
ఎమ్మార్పీఎస్ చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా గొర్రెపాటి సుభాషిని నియామకం..
చిలకలూరిపేట: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) బలోపేతమే లక్ష్యంగా చిలకలూరిపేట నియోజకవర్గ నూతన కమిటీని శనివారం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ నాయకత్వంలో చిలకలూరిపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా గొర్రెపాటి సుభాషిని మాదిగను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బ్రహ్మయ్య నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం: కోటా సుబ్బు మాదిగ..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటా సుబ్బు మాదిగ మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూతన కమిటీలను నిర్మించి, ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. మహిళా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు పెనుమల అరుణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది.తన నియామకానికి సహకరించిన పెద్దలకు సుభాషిని మాదిగ కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ఎస్సీల సమస్యలపై పోరాటం: కలెక్టర్ స్పందించాలని డిమాండ్.
నియోజకవర్గంలోని పలు సమస్యలను నాయకులు ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎస్సీ కాలనీలకు స్మశానవాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొప్పూడి గ్రామ ఎస్సీల భూములను నేషనల్ హైవే అథారిటీ వారు సేకరించి మూడు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు జిల్లా కలెక్టర్ పరిహారం పంపిణీపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. వెంటనే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పెనుమల అరుణా మాదిగ, సీనియర్ నాయకురాలు బొంత రాణి మాదిగ, నరసరావుపేట మండల అధ్యక్షులు వేశపోగు తిమోతి మాదిగ, సీనియర్ నాయకులు కొండ మోడీ కోటి మాదిగ, పట్టణ నాయకులు గోళ్లమూడి రాజశేఖర్ మాదిగ, నందిగామ నాని మాదిగ, సురేష్ మాదిగ, బొంత నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS