చిలకలూరిపేట: స్థానిక జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ శనివారం 'సత్యాగ్రహం' దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌న...
చిలకలూరిపేట: స్థానిక జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ శనివారం 'సత్యాగ్రహం' దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో 'సత్యాగ్రహం' దినపత్రిక ముందుండాలని ఆకాంక్షించారు.పత్రికా విలువలను కాపాడుతూ, నిష్పక్షపాతంగా వార్తలను ప్రజలకు అందిస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.నూతన సంవత్సరంలో పత్రిక మరెన్నో విజయాలు సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సత్యాగ్రహం దినపత్రిక బ్యూరో మరియు APUWJ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్, సాక్షిత ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో తోట మల్లికార్జునరావు, పెన్ పవర్ రిపోర్టర్ ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు.
COMMENTS