చిలకలూరిపేట:శ్రీకృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఉపకార వేతన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జరుగుల.హేమంత్...
చిలకలూరిపేట:శ్రీకృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో ఉపకార వేతన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జరుగుల.హేమంత్ తెలిపారు.ఈ పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలోనే జరుగనుందని ఆయన తెలిపారు.ప్రతి తరగతి విద్యార్థులకు వారి సిలబస్ స్థాయిలోనే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. నాలుగో తరగతి విద్యార్థులకు మ్యాథమెటిక్స్ 60 మార్కులకు, ఐదో తరగతికి మ్యాథ్స్ 40 మార్కులు,సైన్స్ 20 మార్కులకు,ఆరు,ఏడు, ఎనిమిది తరగతులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ చొప్పున 30 మార్కులకు పరీక్ష జరుగుతుందని డైరెక్టర్ వివరించారు.విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ 3 చివరి తేదీగా ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9381000087, 9849828045 సెల్ నంబర్లు సంప్రదించాలని సూచించారు.
COMMENTS