21 వాహనాలు, 14 ఆయుధాలు స్వాధీనం.. చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నరసరావుపేట డివిజన్ పరిధిలోని చిలకల...
21 వాహనాలు, 14 ఆయుధాలు స్వాధీనం..
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నరసరావుపేట డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నరసరావుపేట డిఎస్పి హనుమంతరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో సబ్ డివిజన్ పరిధిలోని సి.ఐలు, ఎస్.ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిని జల్లెడ పట్టిన పోలీసులు, సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను మరియు 14 ప్రాణాంతక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా డిఎస్పి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూనియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలవుతుండటం ఆందోళనకరమని, అలవాట్లకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఎక్కడైనా గంజాయి లేదా మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.
COMMENTS