నాదెండ్ల:చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాల్లో నాదెండ్ల గ్రామానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు...
నాదెండ్ల:చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాల్లో నాదెండ్ల గ్రామానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ గ్రామం 'గుండెకాయ' వంటిదని తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. నాదెండ్ల గ్రామంలో యువ నాయకుడు, ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
గ్రామ ప్రజలకు పుల్లారావు రుణపడి ఉంటారు...
ప్రత్తిపాటి పుల్లారావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీని అందించి గెలిపించిన చరిత్ర నాదెండ్ల గ్రామానిదేనని కంచర్ల గుర్తు చేశారు. "ప్రత్తిపాటి విజయాల్లో నాదెండ్ల పాత్ర వెలకట్టలేనిది. అందుకే ఈ గ్రామ ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి నాదెండ్ల ఆయువుపట్టు వంటిది" అని కొనియాడారు.
సేవా దృక్పథంతో కోట్లాది రూపాయల ఖర్చు..
ఇది కేవలం రాజకీయ సభ కాదని, పదిమందికి సేవ చేయాలనే దృక్పథంతోనే ప్రత్తిపాటి పుల్లారావు తన సొంత నిధులతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలాంటి మహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50,000 పైచిలుకు ఆపరేషన్లు చేయించి ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని, ముఖ్యంగా వృద్ధులకు నేత్రదానం చేయించడం అభినందనీయమని కంచర్ల పేర్కొన్నారు.
నియోజకవర్గ అదృష్టం.. ప్రత్తిపాటి నాయకత్వం..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రత్తిపాటి పుల్లారావు మాటకు ఎంతో విలువ ఉందని, అలాంటి గొప్ప వ్యక్తి మన శాసనసభ్యుడిగా ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గత 30 ఏళ్లుగా ఆయన వెంటే ఉండి పని చేస్తున్నానని చెప్తూ, బీసీలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్తిపాటి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. "ప్రత్తిపాటి అంటే తెలుగుదేశం.. తెలుగుదేశం అంటే ప్రత్తిపాటి" అనేంతగా ఆయన పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారని తెలుపుతూ శ్రీనివాసరావు ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు.
నెల్లూరు సదాశివరావు సేవలు అనన్యం..
ఈ సందర్భంగా నెల్లూరు సదాశివరావు సేవలను కూడా కంచర్ల ప్రత్యేకంగా ప్రస్తావించారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ముఖ్యంగా ప్రత్తిపాటి అందుబాటులో లేని సమయంలో అందరూ 'నాదెండ్ల సదాశివరావు దగ్గరకు వెళ్దాం పదండి' అనేంత నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నారని తెలిపారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్లే సదాశివరావు కూడా నియోజకవర్గానికి ఆయువుపట్టు వంటివారని పేర్కొన్నారు. శరత్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
COMMENTS