చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గర్భధారణ సమయంలో అత్యంత క్లిష్టమైన స...
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గర్భధారణ సమయంలో అత్యంత క్లిష్టమైన సమస్యగా భావించే PPROM కేసును ఎదుర్కొన్న ఓ మహిళకు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా ఆధ్వర్యంలో విజయవంతంగా ప్రసవం జరిగింది. పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
సవాలుగా మారిన PPROM స్థితి..
సాధారణంగా ప్రసవ సమయం కంటే ముందే ఉమ్మనీరు పోవడాన్ని (PPROM) వైద్య భాషలో అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో శిశువు ప్రాణాలకు, ఎదుగుదలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, డాక్టర్ లావు సుష్మా తన అనుభవంతో, అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఈ కేసును డీల్ చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసవం పూర్తి చేసి తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా చూశారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన....
ఈ సందర్భంగా డాక్టర్ సుష్మా మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. సరైన పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల శిశువు ఎదుగుదల బాగుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సానుకూల ఫలితాలుసాధించవచ్చని ఆమె వివరించారు.
క్రమం తప్పని వైద్య పరీక్షలే రక్షణ.
గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల లోపాలను ముందుగానే గుర్తించవచ్చని డాక్టర్ సుష్మా సూచించారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా ఇలాంటి రిస్క్ ఉన్న కేసులను కూడా విజయవంతం చేసి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె హితవు పలికారు. క్లిష్టమైన కేసును విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ సుష్మాను, లీలావతి హాస్పిటల్స్ సిబ్బందిని బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు.
COMMENTS