యడ్లపాడు: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని 'లలిత ఫిల్లింగ్ స్టేషన్'ను ఆకస్మికంగ...
యడ్లపాడు: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం యడ్లపాడు మండలం తిమ్మాపురంలోని 'లలిత ఫిల్లింగ్ స్టేషన్'ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన పంపిణీ తీరు, స్టాక్ రిజిస్టర్లు, సీసీటీవీ కెమెరాల పనితీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని మరియు నిబంధనల మేరకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి, యడ్లపాడు తహశీల్దారు, ఎస్ఐ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS