చిలకలూరిపేట: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్ఐ జి. అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహి...
చిలకలూరిపేట: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్ఐ జి. అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. పసుమర్రు గ్రామ పరిధిలోని గొర్రెల మండి రోడ్డు వద్ద పేకాటాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ₹2,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా, మానుకొండవారిపాలెం పొలాల్లో పేకాటాడుతున్న మరో ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుండి ₹3,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేశామని, మండల పరిధిలో కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
COMMENTS