చిలకలూరిపేట: జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పెట్రోల్ బంకులపై అధికారులు ఉక్కుపాదం మోపుతు...
చిలకలూరిపేట: జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పెట్రోల్ బంకులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగంలో కృత్రిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు లారీలకు గరిష్టంగా 50 లీటర్ల వరకు మాత్రమే ఇంధనాన్ని నింపాలని జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే పట్టణంలోని ఇండియన్ ఆయిల్ (జనత) పెట్రోల్ బంక్‌లో ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ లారీలకు ఫుల్ ట్యాంక్ చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ హుస్సేన్ సదరు బంక్‌ను తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి ఆయిల్ సరఫరాను నిలిపివేశారు .ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అవసరానికి మించి వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల మార్కెట్‌లో అనవసరమైన ఇంధన కొరత ఏర్పడుతోంది.ఉదయం నుండి జిల్లావ్యాప్తంగా అనేక బంకులను తనిఖీ చేసి, ప్రజలకు మరియు యజమానులకు అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసే బంకు యజమానులపై మరియు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాహనదారులు కూడా అధికారులకు సహకరించి, కేవలం తమ అవసరానికి సరిపడా ఇంధనాన్ని మాత్రమే తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.
COMMENTS