కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్షా అభ...
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తర గతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు గతంలో ప్రకటించిన గడువు బుధవారంతో ముగిసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్ధన మేరకు పదో తేదీ వరకు పొడిగించినట్లు ఆయన వెల్ల డించారు. అనాథలు, బడిబయట పిల్లలు, బడి మానేసిన వారు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
COMMENTS