6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెర.. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) విద్యార్థులకు కీలక అప్‌డేట్.ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ న...
6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెర..
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) విద్యార్థులకు కీలక అప్‌డేట్.ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో జరిగిన టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ ఏడాదిరాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. రేపు ఉదయం నిర్ణీత సమయానికి విద్యాశాఖ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.....
విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు:
అధికారిక వెబ్‌సైట్లు:
results.bse.ap.gov.in
bse.ap.gov.in
WhatsApp ద్వారా:
ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటును కల్పిస్తున్నారు.
SMS & థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు: మనబడి (Manabadi) వంటి ఇతర పోర్టల్స్ ద్వారా కూడా రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి.
ముఖ్య గమనిక..
ఫలితాలు విడుదలైన వెంటనే సర్వర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు కాసేపు వేచి ఉండి అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. ఫలితాలు చూసుకోవడానికి మీ హాల్ టికెట్ నంబర్ సిద్ధంగా ఉంచుకోండి.
విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!..
COMMENTS