నరసరావు పేట: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో అటవీ శాఖ అనుమతి కోసం సంబంధిత శాఖలు డీజీపీఎస్ సర్వే పూర్తి చేయ...
నరసరావు పేట: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో అటవీ శాఖ అనుమతి కోసం సంబంధిత శాఖలు డీజీపీఎస్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో అటవీ శాఖ అనుమతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో అటవీ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సరఫరా లైన్లు, తాగునీటి సరఫరా పైపులైన్ల వంటి కార్యక్రమాలకు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవడంపై అధికారులకు సహకరించాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు.
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ బోటింగ్ పున: ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 10 నుంచి కొండవీడు కోటపై నైట్ క్యాంపింగ్ సేవలు ప్రారంభించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా అటవీ అధికారి కృష్ణ ప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
COMMENTS