నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామంలో ఆరే మణీంద్ర నివాసంలో పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మణీంద్ర కుమారులు మహాదేవ్...
నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామంలో ఆరే మణీంద్ర నివాసంలో పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మణీంద్ర కుమారులు మహాదేవ్ చౌదరి (మొదటి పుట్టినరోజు), మహాన్వీర్ చౌదరి (మూడవ పుట్టినరోజు) వేడుకలను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, చిరంజీవులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఆరె వెంకటేశ్వర్లు, నాతాని సురేంద్ర, ఆరె మోహన్ రావు, కిలారు బాలకృష్ణ, మామిళ్ళపల్లి వాసు, తోట రాము, మామిళ్లపల్లి కోటేశ్వరరావు, గద్దె కోటేశ్వరరావు, మక్కెన భాస్కర్, తుళ్ళూరి శ్రీనివాసరావు, గుండకపనేని సతీష్, కొమ్మాలపాటి కిషోర్, కొమ్మాలపాటి సాంబయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొని చిన్నారి చిరంజీవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
COMMENTS