బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు. చిలకలూరిపేట: పట్టణంలో ఒక్కసారిగా ఇంధన కలకలం రేగింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే ప్రచ...
బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు.
చిలకలూరిపేట: పట్టణంలో ఒక్కసారిగా ఇంధన కలకలం రేగింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే ప్రచారంతో వాహనదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీనితో పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి.
వదంతులతో పెరిగిన ఆందోళన..
దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. త్వరలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం లేదా స్టాక్ అయిపోతుందనే వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురై బంకుల వద్దకు పరుగులు తీశారు.
అసహనంలో వాహనదారులు...
గంటల తరబడి ఎండలో వేచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద రద్దీ పెరగడంతో ట్రాఫిక్ స్తంభించి సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ అయోమయానికి తెరదించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
"నిజంగా కొరత ఉందా లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. బంకుల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి." -
చిలకలూరిపేట పట్టణ వాసులు
సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బంకుల వద్ద పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
COMMENTS