చిలకలూరిపేట: స్థానిక బాలుర వసతి గృహంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛా...
చిలకలూరిపేట: స్థానిక బాలుర వసతి గృహంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని, విద్యార్థులతో కలిసి హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకోవాలని, ముఖ్యంగా వ్యర్థాలను పారేయకుండా వాటిని సంపదగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. హాస్టల్‌లో కూరగాయల వ్యర్థాల ద్వారా వర్మీ కంపోస్ట్ (ఎరువు) తయారు చేసే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, విద్యార్థులను అభినందించారు.రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా విస్త్రుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు.
COMMENTS