యువకుడిపై దాడి, ముఖంపై తీవ్ర గాయాలు.. చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి.మంగళవారం కాలనీకి ...
యువకుడిపై దాడి, ముఖంపై తీవ్ర గాయాలు..
చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి.మంగళవారం కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడిపై ఒక వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా,ఒక్కసారిగా ఒక వీధి కుక్క అతనిపైకి దూకింది. తప్పించుకునే లోపే కుక్క ప్రవీణ్ ముఖం,పెదవుల మీద బలంగా కొరికింది.ఈ దాడిలో అతనికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రవీణ్ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనేఅక్కడికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు.తీవ్రంగాగాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
భయాందోళనలో ప్రజలు...
ఈ ఘటనతో సుగాలి కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ఒంటరిగాబయటకు రావాలంటేనే వణుకుపుడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వృద్ధులుబయటకురావడానికిభయపడుతున్నారని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు.మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా కుక్కల బెడద తగ్గలేదని వారు ఆరోపిస్తున్నారు.మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, వీధి కుక్కలను నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టాలి.మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
COMMENTS