ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్,అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికినిర్వహించే 'ఏపీ ఈఏపీసెట్-2026'...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్,అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికినిర్వహించే 'ఏపీ ఈఏపీసెట్-2026' (AP EAPCET) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఎటువంటి అదనపు రుసుము (Late Fee) లేకుండా దరఖాస్తుచేసుకోవడానికి మార్చి 24వ తేదీ ఆఖరి గడువు అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో సీటు పొందే అవకాశం ఉంటుంది.అగ్రికల్చర్, బి.టెక్, ఫార్మసీ వంటి సుమారు 30కి పైగా వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అందించే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని,దీని ద్వారా ఉచితంగా ఉన్నత చదువులు అభ్యసించే వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు.సాఫ్ట్‌వేర్, పరిశోధన మరియు ప్రభుత్వ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష ఒక చక్కని వేదిక.
అభ్యర్థులకు గమనిక..
రేపటి (మార్చి 25) నుండి దరఖాస్తు చేసుకునే వారు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య రుసుము వరకు పెరిగే అవకాశం ఉన్నందున,ఆసక్తి గల విద్యార్థులు పెనాల్టీ పడకుండా ఈరోజే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
COMMENTS