చిలకలూరిపేట: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ...
చిలకలూరిపేట: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సంజీవ్‌నగర్, ఆది ఆంధ్ర కాలనీల్లో డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో, అర్బన్ సీఐ పి. రమేష్ మరియు సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.ఈ ఆకస్మిక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
COMMENTS