ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రీ-పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఈ నెల ఫ...
ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రీ-పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఈ నెల ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ పైన సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
ఫలితాల సమీక్ష ఇటీవల ముగిసిన ప్రీ-పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల పనితీరును కలెక్టర్ విశ్లేషించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తగు సూచనలు చేస్తూ, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఈ నెల ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల పకడ్బందీ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సూచనలు:
హాల్ టికెట్లు: పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్ సౌకర్యం: విద్యార్థులు తమ హాల్ టికెట్లను 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ (MANA MITHRA WhatsApp) నంబర్ ద్వారా కూడా సులభంగా పొందవచ్చు.
ఫీజుల వేధింపులపై హెచ్చరిక: ఏ కళాశాల యాజమాన్యమైనా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపినా లేదా విద్యార్థులను ఒత్తిడికి గురిచేసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
COMMENTS