ప్రముఖ వైద్యులు కొమ్మినేని శంకర్ రావును ఘనంగా సన్మానించిన మాజీమంత్రి. చిలకలూరిపేట: కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్...
ప్రముఖ వైద్యులు కొమ్మినేని శంకర్ రావును ఘనంగా సన్మానించిన మాజీమంత్రి.
చిలకలూరిపేట: కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు, మాకు అత్యంత ఆప్తులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని శంకర్ రావు కి టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం లభించడం నియోజకవర్గ, జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శనివారం స్థానిక కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు కొమ్మినేని శంకర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రత్తిపాటి, ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.
ప్రజలు గర్వించే స్థాయిలో కొమ్మినేని మరిన్ని అవార్డులు, పురస్కారాలు పొందాలి..
వైద్యసేవల్లో కొమ్మినేని శంకర్ రావు అందించిన సేవలకు గుర్తుగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం అందజేయడంపై ఎంతో సంతోషంగా ఉందని, ఆ పురస్కారం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా మాకు ఆప్తులైన శంకర్ రావు అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలు మెచ్చేలా వారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చిలకలూరిపేటలో నంబర్ -1 వైద్యశాలగా పేరు పొందిందన్నారు. ప్రజలందరి చేత మా డాక్టర్ గారు అని పిలిపించుకునే గొప్ప వైద్యులుగా శంకర్ రావు పేరు ప్రఖ్యాతులు పొందారని, ఆయన భవిష్యత్ లో మరిన్ని జాతీయస్థాయి అవార్డులు సాధించి, ఇక్కడి ప్రజలందరూ గర్వించే స్థాయిలో నిలవాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మక్కెన నరసింహారావు, కంచర్ల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS