•ప్రజల ఆస్తుల్ని కబళించే ప్రయత్నమే జగన్ ను 11 స్థానాలకు పడేసింది. •పట్టాదారు పాసు పుస్తకాల తప్పుల్ని రెవెన్యూ యంత్రాంగం త్వరగానే...
•ప్రజల ఆస్తుల్ని కబళించే ప్రయత్నమే జగన్ ను 11 స్థానాలకు పడేసింది.
•పట్టాదారు పాసు పుస్తకాల తప్పుల్ని రెవెన్యూ యంత్రాంగం త్వరగానే సరిచేస్తుంది.
•యడ్లపాడు మండలం తిమ్మాపురంలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీచేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు.
•బొడ్డురాయి వార్షికోత్సవంలో పాల్గొని ప్రజలకు అన్నవితరణ చేసిన మాజీమంత్రి, ఎంపీ.
ప్రభుత్వ సొమ్ముతో పాటు.. తమ ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలు ఎప్పటికీ మరువలేరని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్నఆదరణ, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే అసూయంతో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, కూటమి నాయకులతో కలిసి యడ్లపాడు మండలం తిమ్మాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీలిద్దరూ ప్రభుత్వ నిధులు, గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, పలువురు దాతల సహకారంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇరువురూ రాజుమద్రతో ముద్రించిన ప్రభుత్వ పట్టాదారు పాసు పుస్తకాలను స్వయంగా రైతులకు అందచేశారు. తర్వాత గ్రామంలోని బొడ్డురాయి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించి, భక్తులకు అన్నవితరణ చేశారు. స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఇరువురూ విలేకరులతో మాట్లాడారు.
ప్రజల భూములు, ఆస్తులు కబళించాలన్న ప్రయత్నమే జగన్ ను 11 స్థానాలకు పడేసిందని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం ద్వారా జగన్ తన పతనానికి తానే నాంది పలికాడన్నారు. పాసు పుస్తకాల్లోని తప్పులపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెవెన్యూ యంత్రాంగం వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తుందన్నారు. జగన్ తన ఫొటోతో పాస్ పుస్తకాలు వేసుకుంటే. కూటమిప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో వాటిని ముద్రించిందన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని అందించేందుకు దాతలు ముందుకొచ్చారని చెప్పారు. గ్రామస్తులకు అవసరమైన శ్మశాన స్థలాన్ని రూ.25 లక్షలతో కొనుగోలు చేసి, మరో రూ.30 లక్షలతో దాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. గ్రామస్తులు అయిన ఆలూరి శ్రీనివాసరావు పేదల ఇళ్ల స్థలాల కోసం 2 ఎకరాలు దానం చేయడానికి ముందుకురావడంపై ప్రత్తిపాటి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. దాత నాగండ్ల రాంబాబు సహకారంతో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషాన్నిచ్చిందన్నారు.
దళితవాడలో వాలీబాల్ కోర్టును కూడా అభివృద్ధి చేశారన్నారు. గ్రామాభివృద్ధికోసం గ్రామస్తులంతా ఐక్యంగా పనిచేయడం నిజంగా గర్వించాల్సిన విషయమన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ముద్దన సాంబశివరావు, బొడ్డపాటి సాంబశివరావులు తిమ్మాపురంతో పాటు, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహాయ సహాకారాలు అందిస్తూ ప్రజల మనసులు గెలిచారని ప్రత్తిపాటి ప్రశంసించారు. నారా-నందమూరి కుటుంబాలకు తిమ్మాపురం గ్రామం అత్యంత ప్రీతిపాత్రమైనదని ప్రత్తిపాటి చెప్పారు. త్వరలోనే గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనల ప్రారంభోత్సవానికి మంత్రి లోకేశ్ సతీమణి బ్రాహ్మణిని ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు.
ఐక్యతే అభివృద్ధి పథాన నిలిపింది : ఎంపీ లావు..
తిమ్మాపురం గ్రామాభివృద్ధిలో గ్రామస్తులు ఐక్యత చూస్తే ముచ్చటేస్తోందని, వారందరి సమష్టి సహకారమే నేడు గ్రామాన్ని అభివృద్ధిపథాన నిలిపిందని ఎంపీ లావు శ్రీ కష్ణ దేవరాయలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన చెప్పారు. అభివృద్ధిలో తిరుగులేని విధంగా తిమ్మాపురం మారాలని, నియోజవకర్గంతో పాటు జిల్లాకే ఆదర్శంగా నిలవాలని ఎంపీ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మద్దిరాల మ్యాని, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, తేళ్ల సుబ్బారావు, పోపూరి వెంకయ్య, కందిమల్ల రఘురామారావు, ముద్దన నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాలినేని శేఖర్, ఎంపీటీసీ రాజేష్, రాజేశ్వరి, సర్పంచి ప్రభావతి, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
COMMENTS