ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం.. పల్నాడు జిల్లా కేంద్రం ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా ...
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం..
పల్నాడు జిల్లా కేంద్రం ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లు మరియు ఇతర రెవెన్యూ అంశాలపై ప్రజలకు ఉన్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు ఈ క్లినిక్ ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. అర్జీదారులు సమర్పించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
COMMENTS