చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు ప్రతి...
చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు ప్రతిష్టాత్మకమైన "టైమ్స్ ఆఫ్ ఇండియా" పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు మరియు సిబ్బంది ఆయనను శుభాకాంక్షలు తెలియజేశారు.వైద్య వృత్తిలో ఆయన ప్రదర్శిస్తున్న నిబద్ధత, రోగుల పట్ల చూపే అంకితభావం ఈ అవార్డు ద్వారా మరోసారి నిరూపితమైందని సహచర వైద్యులు కొనియాడారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ డాక్టర్ వీరశంకరరావు ముందుంటున్నారని సిబ్బంది పేర్కొన్నారు.
COMMENTS