ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్డిఓ . ఎడ్లపాడు: రైతుల అధికారిక ఆస్తి హక్కుల భద్రతకు పట్టాదారు పాసుస్తకాలు కీలకమని,ఇవి పూర్తిగా త్వరగా ...
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్డిఓ .
ఎడ్లపాడు: రైతుల అధికారిక ఆస్తి హక్కుల భద్రతకు పట్టాదారు పాసుస్తకాలు కీలకమని,ఇవి పూర్తిగా త్వరగా అందాలని ఆర్డిఓ మధులత ఆదేశించారు.శనివారం ఎడ్లపాడు మండల పరిధిలోని జాలాది గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాసుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె రైతులకు పాస్ పుస్తకాలను ప్రత్యేకంగా అందజేశారు.మండల పరిధిలో పంపిణీ శాతం చాలా తక్కువగా ఉందని తన అసంతృప్తి వ్యక్తం చేసిన మధులత,ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముందు 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు ఖచ్చిత సూచనలు ఇచ్చారు.పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఆస్తి హక్కుల స్పష్టతను ఇస్తాయి.ఇవి లేకపోతే రుణాలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందడం కష్టమవుతుంది. అందుకేమండలంలో మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయండి అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయశ్రీ, వీఆర్వో భాష, సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతులు పాసుస్తకాలు అందుకుని సంతోషం వ్యక్తం చేసుకున్నారు.
COMMENTS