మానసిక స్థితి దెబ్బతిన్న వ్యక్తిని కుటుంబానికి అప్పగింత. ఎడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామం జాతీయ రహదారిపై మానసిక స్థితి సరిగా లే...
మానసిక స్థితి దెబ్బతిన్న వ్యక్తిని కుటుంబానికి అప్పగింత.
ఎడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామం జాతీయ రహదారిపై మానసిక స్థితి సరిగా లేకుండా తిరుగుతున్న ఒక వ్యక్తిని ఎడ్లపాడు పోలీసులు గుర్తించి, మానవతా దృక్పథంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతని వివరాలు తెలుసుకుని, బంధువులు చేరే వరకు భద్రంగా ఉంచి, శుక్రవారం (09-01-2026) రాత్రి నుంచి శనివారం (10-01-2026) వరకు సురక్షితంగా కాపాడారు.పెండ్యాల సూరిబాబు (తండ్రి: కామేశ్వరరావు, నివాసం కన్నా నగర్, కాకినాడ) అని గుర్తించబడిన సదరు వ్యక్తి బంధువులు స్టేషన్‌కు చేరుకుని వివరాలు ధృవీకరించగానే, పోలీసులు అతన్ని సక్రమంగా అప్పగించారు.ఈ సంఘటనకు సంతోషం వ్యక్తం చేసిన బంధువులు ఎడ్లపాడు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ టి శివరామకృష్ణ మాట్లాడుతూ
ప్రజల భద్రతతో పాటు మానవీయ విలువలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
COMMENTS